మార్చి 3న 'మెట్రో' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`. రజని తాళ్లూరి నిర్మాత. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ప్రఖ్యాత గాయని గీతామాధురి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ర్టాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రజని తాళ్లూరి మాట్లాడుతూ - ``తెలుగు అనువాదం నాణ్యంగా చేశాం. సాహితి చక్కని మాటలు-పాటలు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. గౌతమ్‌మీనన్, అలాగే ఏ.ఆర్.మురుగదాస్ అంతటి ప్రముఖులు మా సినిమాని ప్రశంసించడం ఆనందాన్నిచ్చింది. మార్చి 3న సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - ``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. గౌతమ్ మీనన్ ప్రశంస తర్వాత ట్రైలర్ చూసి ఏ.ఆర్.మురుగదాస్ అభినందించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. మురుగదాస్ నిర్మించిన `ఎంగేయుమ్ ఎప్పోదుమ్` చిత్రాన్ని తెలుగులో `జర్నీ` పేరుతో అందించి విజయం అందుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రశంస పొందిన `మెట్రో` అంతకుమించి విజయం సాధిస్తుందన్న ధీమా ఉంది. తెలుగు ఆడియెన్స్ కు ప్రామిస్సింగ్ సినిమాని అందిస్తున్నాం. మార్చి 3 సినిమా విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ సినిమా ఇది` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com