ఈనెల మూడవ వారంలో మెట్రో..!
- IndiaGlitz, [Tuesday,November 01 2016]
రియలిస్టిక్ కథలు, నేచురల్ పెర్ఫామెన్స్ స్ తో సినిమా తీస్తే స్టార్ డమ్ తో పని లేకుండా సక్సెస్ దక్కుతుంది. అందుకే ప్రస్తుతం అలాంటి సినిమాల్ని తెలుగులో అందించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా...ఇలా ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సక్సెస్ ఫుల్ నిర్మాత సురేష్ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి అందిస్తున్న తాజా చిత్రం మెట్రో. ఈ సినిమా అనువాద కార్యక్రమాలు సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈనెల మూడోవారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, ఆర్ 4 ఎంటర్ టైన్మెంట్స్ అధినేత రజని తాళ్లూరి మాట్లాడుతూ...తెలుగు నేటివిటీకి తగ్గ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. హృదయాల్ని టచ్ చేసే ఆద్యంతం రంజింపచేసే సన్నివేశాలకు సినిమాలో కొదవేలేదు. ఈ నెల మూడవ వారంలో సినిమా రిలీజ్ చేయనున్నాం అన్నారు.
చిత్ర సమర్పకులు సురేష్ కొండేటి మాట్లాడుతూ... వాస్తవికత, విలక్షణత ఉన్న కథలతో తెరకెక్కిన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవలోనే ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా చిత్రాల్ని మా బ్యానర్ లో అందించి బ్లాక్ బస్టర్స్ సాధించాం. అవన్నీ సహజ సిధ్దమైన నటన, చక్కని కథాంశంతో తెరకెక్కినవే కావడం వల్ల బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. ఆ కోవలోనే మెట్రో హృదయాల్ని టచ్ చేసే రియలిస్టిక్ స్టోరీతో తెరకెక్కింది. మనం నిత్యం వార్తా చానెళ్లలో చైన్ స్నాచర్ల గురించి వింటూనే ఉన్నాం. సామాన్యుడి బతుకులో ఈ చైన్ స్నాచింగ్ ఎలాంటి చిచ్చు పెడుతుందో మెట్రో సినిమాలో చూడొచ్చు. తన కన్న తల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్ ఆ క్రమంలో తన తెలుసుకున్న నిజాలేంటి..? అసలు చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి..? అన్నది తెర పైనే చూడాలి అన్నారు.
శిరీష్, బాబి సింహా, సేంద్రన్, నిశాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం - జోహన్, మాటలు - పాటలు - సాహితి, కెమెరా - ఎన్.ఎస్ .ఉదయ్ కుమార్, నిర్మాత - రజని తాళ్లూరి, సమర్పకులు - సురేష్ కొండేటి, దర్శకత్వం - ఆనంద కృష్ణన్