ఈనెల 30న వస్తున్న మెట్రో

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా లాంటి వైవిద్య‌మైన, ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సినిమాల‌ను అందించిన నిర్మాత సురేష్ కొండేటి. ప్ర‌స్తుతం ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ర‌జ‌నీ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం మెట్రో. ఈ చిత్రం తొలి కాపీ ఇటీవ‌లే రెడీ అయింది. ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం.
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ.... నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీసిన మంచి చిత్ర‌మిది. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికి మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే చిత్ర‌మిది.ఈనెల 30న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇటీవ‌ల రిలీజైన మెట్రో టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా గొప్ప స‌క్సెస్ అవుతుంది అన్నారు.
చిత్ర స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ... చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మెచ్చిన చిత్రం కూడా. నేను నిర్మించిన 'జ‌ర్నీ' సినిమాని మించి 'మెట్రో' విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. గీతామాధురి న‌టించిన పాట‌కు ప్రేక్ష‌కాభిమానుల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది అన్నారు.

More News

అమీర్ కు రజనీ అందుకే నో చెప్పాడా..!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం దంగల్.నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటించడం మానేస్తే ఆయనే ఎక్కువ బాధపడతారు - సమంత..!

నాగ చైతన్య - సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌నతా గ్యారేజ్ త‌ర్వాత చేయ‌బోయే సినిమాను ఎట్ట‌కేల‌కు ఎనౌన్స్ చేసారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

వైభవంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థ వేడుక...

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

రవితేజతో మహాలక్ష్మి

హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో మహాలక్ష్మిగా పరిచయమైన పంజాబీ భామ మెహరీన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది.