ప్రధాని పిలుపు.. రేపు 5గంటలకు దద్దరిల్లిపోవాలి!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు మోదీ సూచనలు పాటిద్దామని..సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులు, దేశ ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించగా.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రేపు దద్దరిల్లిపోవాలంతే..!
‘రేపు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దాం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలి.. ఇదే మనం వారికిచ్చే గౌరవం.. ఆ చప్పట్లలో మనం వారికిచ్చే గౌరవం కనిపించాలి. ప్రధాని పిలుపును అందరూ పాటించాలి. కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలి’ అని మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చాడు. మహేశ్ ట్వీట్‌ను అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. మరోవైపు లైక్‌లు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com