YS Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల పార్టీ విలీనం ఖాయం.. ముహూర్తం ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైయస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌టీపీ భేటీలో షర్మిల కీలక ప్రకటన చేశారు. జనవరి 4వ తేదీన YSRTPని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకు స్పష్టం చేశారు. అలాగే పార్టీకి ఎందుకు విలీనం చేయాల్సి వస్తుందో వివరించారు. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌లో ఏ బాధ్యతలు స్వీకరించబోతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నానని షర్మిల తెలిపారు.
సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఒకటి రెండు రోజుల్లో అన్ని విషయాలు తానే స్వయంగా చెబుతానంటూ వెల్లడించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీతో టచ్‌లో ఉన్నారా..? అనే ప్రశ్నకు కూడా నవ్వుతూ సమాధానం చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే వైసీపీకి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని అర్థమవుతోంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు.
మరోవైపు షర్మిల కుటుంబ సమేతంగా ఇవాళ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఘాట్ దగ్గర ఉంచి ఆశీస్సులు తీసుకోనున్నారు. మొత్తానికి కొన్ని రోజులుగా షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com