సూర్య మేము రిలీజ్ ఎప్పుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య నటించి..నిర్మించిన తాజా చిత్రం పసంగ 2. ఈ చిత్రాన్ని తెలుగులో మేము టైటిల్ తో అనువదించారు. జూలకంటి మధుసూదన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ఈ చిత్రంలో సూర్య, అమలాపాల్, బింధు మాధవి ప్రధాన పాత్రలు పోషించారు.
మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన మేము చిత్రాన్ని డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ..కుదరలేదు. ఆతర్వాత డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పడు క్రిస్మెస్ కానుకగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో మేము మళ్లీ వాయిదాపడింది. తాజా సమాచారం ప్రకారం మేము చిత్రాన్ని జనవరి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..మంచి కథాంశంతో రూపొందిన మేము ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com