మేము చాలా నమ్మకంగా ఉన్నాం - నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో ఈనెల 8న విడుదలవుతోంది. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. చిత్ర నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ నిర్మాతలు కె.వి.వి.సత్యనారాయణ, కె.అచ్చిరెడ్డి, మల్కాపురం శివకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, ఫైనాన్సియర్ మల్లిఖార్జున్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ లతో పాటు ప్రముఖ నటుడు సాయికుమార్ పాల్గొన్నారు.
"పిల్లలతో పాటు పెద్దలు తప్పక చూడాల్సిన సినిమా ఇది. సూర్య వంటి సూపర్ స్టార్ ఈ సినిమాని తమిళంలో నిర్మిస్తూ నటించాడంటే.. దాన్ని బట్టి ఈ చిత్రం గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో మరింత పెద్ద విజయం సాధిస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ వినోదాన్ని పంచుతూనే.. చక్కని సందేశాన్నిచ్చే చిత్రమిది" అని వక్తలు పేర్కొన్నారు. ఈ చిత్రం సాధించబోయే విజయంపై "మేము" చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్, మాటలు-పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: "సూపర్ స్టార్" సూర్య-కె.ఇ. జ్ఞాన వేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: పాండిరాజ్!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com