సూర్య చేతుల మీదుగా 'మేము' ఆడియో రిలీజ్
- IndiaGlitz, [Tuesday,November 10 2015]
సూపర్‌స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం పసంగ 2'. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య-కె.ఇ.జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేము' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు సాయిమణికంఠ క్రియేషన్స్ అధినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి. సూర్య సరసన అమలాపాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి బింధుమాదవి ముఖ్యభూమిక పోషించింది. అర్రోల్ కొర్రెల్ స్వర సారధ్యం వహించిన మేము' గీతావిష్కరణ సోమవారం సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో పులువురు సినీ మరియు రాజకీయ ప్రముఖు సమక్షంలో ఘనంగా జరిగింది. చిన్నపిల్లల మనోభావాలు, వారి మానసిక సంఘర్షణ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలను ఆడియో వేడుకకు విచ్చేసిన చిన్నపిల్లల్లోని కొంత మందిని ఎంపిక చేసి వారి చేత విడుదల చేయించడం విశేషం. ఆడియోను సూర్య విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో సూర్య, చిత్ర కథానాయకి అమలాపాల్, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకుడు పాండిరాజ్, సంగీత దర్శకుడు అర్రోల్ కొరెల్, మాచర్ల శాసనసభ్యులు పి.రామకృష్ణారెడ్డి, శివకృష్ణ, కె.వి.వి.సత్యనారాయణ, ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి, రిటైర్డ్ జడ్జ్ కాంతయ్య, వీరుపోట్ల, మల్టీడైమన్షన్ వాసు, గిరి, సుబ్బయ్య, మల్లి, సాయిరెడ్డి, కె.కె.రాధామోహన్, నరేంద్ర రాజు, మహాలక్ష్మి సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ... మా బ్యానర్లో జ్యోతిక నటించిన 36 వయదినిలే' చిత్రం తర్వాత నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం పాండిరాజ్ చాలా రీసెర్చ్ చేశారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన అర్రోల్ కొర్రెల్ సంగీతంపై ప్యాషన్‌తో ఎంతో శ్రద్దతో సంగీతం నేర్చుకొని సంగీత దర్శకుడయ్యారు. ఈ సినిమాకు మంచి సంగీతాన్నందించారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... నేను సూర్యగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఏ పాత్రలోకైకా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగలగడం ఆయన ప్రత్యేకత. సూర్య తమిళంలో నిర్మిస్తూ నటిస్తున్న చిత్రాన్ని తెలుగులో మేము' పేరుతో నిర్మిస్తూ నిర్మాతగా పరిచయమవుతుండడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మనం, దృశ్యం' చిత్రాల కోవలో ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది' అన్నారు.
కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ... సూర్య తండ్రి శివకుమార్ నటించిన సింధుభైరవి'తోపాటు సూర్య నటించిన రెండు సినిమాను తెలుగులో అనువాదం చేశాను. ఈ సినిమా నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డిగారు నన్ను కలిసి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని అనగానే, పసంగ 2' సినిమాను తెలుగులోకి అనువాదం చేయమని నేను చెప్పి సినిమా హక్కును తనకు వచ్చేలా చేశాను. సినిమా డిఫరెంట్‌గా ఉంది, తప్పకుండా అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది'' అన్నారు.
శశాంక్ వెన్నెకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్ కె.యల్, సాహిత్యం: వెన్నెకంటి, చంద్రబోస్, సాహితి, సంగీతం: అర్రోల్ కొర్రెల్, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్.