అనుకిది గుర్తుండిపోయే సంవ‌త్స‌ర‌మే..

  • IndiaGlitz, [Friday,March 09 2018]

ఫ‌లితాల‌ సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది కేర‌ళకుట్టి అను ఇమ్మాన్యుయేల్. 2016లో 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ‌.. 2017లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' సినిమాల్లో కథానాయికగా నటించింది. ఇలా మొదటి రెండు సంవత్సరాలు మూడు సినిమాలతో సందడి చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 4 సినిమాలతో సంద‌డి చేస్తోంది. ఇప్పటికే ఒక చిత్రం విడుదల కాగా.. మరో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

కాస్త వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది ఆరంభంలో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'తో సంద‌డి చేసిన అను.. మేలో మెగా హీరో అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో ప‌ల‌క‌రించ‌నుంది. అలాగే అక్కినేని నాగచైతన్య మూవీ 'శైలజారెడ్డి అల్లుడు'లో కూడా కథానాయికగా నటిస్తోంది ఈ మలబారు భామ.

ఇక గురువారం ప్రారంభ‌మైన రవితేజ, శ్రీనువైట్ల కాంబినేష‌న్ మూవీ 'అమర్ అక్బర్ ఆంటోనీ'లోనూ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. చూస్తుంటే.. ఫ‌లితాల మాటెలా ఉన్నా 2018 అనుకి గుర్తుండిపోయే సంవత్స‌రం అవుతుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

More News

శ‌ర్వానంద్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ న‌టి

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన 'విజయ' (త‌మిళంలో వ‌ల్లి) (1993)చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమయ్యారు ప్రియా రామన్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'శుభ సంకల్పం' (1995), శోభన్ బాబు సరసన 'దొరబాబు' (1995) చిత్రాల్లో నటించారు.

'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు.

రామ్ సినిమా తోనూ కొన‌సాగించిన ద‌ర్శ‌కుడు

గ‌తేడాది విడుద‌లైన 'నేను లోకల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..

యువ క‌థానాయకుడు నిఖిల్ గ‌త రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సంద‌డి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుద‌ల కానుంది.

'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు

''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది.