అనుకిది గుర్తుండిపోయే సంవత్సరమే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫలితాల సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది కేరళకుట్టి అను ఇమ్మాన్యుయేల్. 2016లో 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ.. 2017లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' సినిమాల్లో కథానాయికగా నటించింది. ఇలా మొదటి రెండు సంవత్సరాలు మూడు సినిమాలతో సందడి చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 4 సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఒక చిత్రం విడుదల కాగా.. మరో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది ఆరంభంలో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'తో సందడి చేసిన అను.. మేలో మెగా హీరో అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో పలకరించనుంది. అలాగే అక్కినేని నాగచైతన్య మూవీ 'శైలజారెడ్డి అల్లుడు'లో కూడా కథానాయికగా నటిస్తోంది ఈ మలబారు భామ.
ఇక గురువారం ప్రారంభమైన రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ మూవీ 'అమర్ అక్బర్ ఆంటోనీ'లోనూ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చూస్తుంటే.. ఫలితాల మాటెలా ఉన్నా 2018 అనుకి గుర్తుండిపోయే సంవత్సరం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments