మెమొరబుల్ పిక్: చిరు మూవీ సెట్ లో రోజా,మీనా.. నేరుగా నాగ్ మూవీ నుంచి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పటి అందాల తార మీనా తాజాగా సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తన కోస్టార్ రోజాతో నవ్వులు చిందిస్తున్న మెమొరబుల్ పిక్ ని మీనా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పిక్ వైరల్ గా మారింది. త్రో బ్యాక్ థర్స్ డే అంటూ మీనా ఈ పిక్ షేర్ చేయడం విశేషం.
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరూ హ్యాపీగా ఉన్న ఈ పిక్ కు ఓ ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ ముగ్గురు మొనగాళ్లు సెట్స్ లోనిది ఈ పిక్. ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో మీనా నటించలేదు కదా అనే అనుమానం రావచ్చు. నిజమే.. కానీ మీనా ముగ్గురు మొనగాళ్లు సెట్స్ ని సందర్శించడానికి వెళ్లినప్పటి పిక్ ఇది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'రాజశేఖరా' షూట్ జరుగుతోంది. రాఘవేంద్ర రావు.. చిరు, రోజాపై ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. పక్కనే కింగ్ నాగార్జున అల్లరి అల్లుడు షూట్ కూడా జరుగుతోంది. ఆ చిత్రంలో మీనా హీరోయిన్ గా నటించింది. షూట్ గ్యాప్ మధ్యలో మీనా ముగ్గురు మొనగాళ్లు సెట్స్ కి వెళ్ళింది. కాసేపు తన కోస్టార్ రోజాతో ముచ్చట్లు చెప్పుకుంది. అది సంగతి.
రాజశేఖరా సాంగ్ అంటే తనకు చాలా ఇష్టం అని కూడా మీనా కామెంట్ పెట్టింది. మీనా, రోజా ఇద్దరూ బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ బొబ్బిలి సింహంలో కలసి నటించారు. మీనా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణిస్తోంది. దృశ్యం సిరీస్ లో మీనా ఫిమేల్ లీడ్ లో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments