రానాకి గుర్తుండిపోయేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏడేళ్ల క్రితం 'లీడర్'తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన దగ్గుబాటి వారి వారసుడు రానాకి.. కెరీర్ లో తొలి విజయం దక్కింది మాత్రం 'బాహుబలి'లోని విలన్ పాత్రతోనే. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానాని.. అందులోని పాత్ర పేరు అయిన భళ్లాల దేవ పేరుతోనే పిలిచే వాళ్లు ఎక్కువయ్యారు కూడా. బాహుబలికి ముందు.. బాహుబలికి తరువాత అన్నట్లుగా రానా కెరీర్ని చెప్పుకోవచ్చు.
రానాకి కలిసొచ్చిన సినిమాగా బాహుబలిని చెప్పుకుంటే.. కలిసొచ్చిన ఏడాది మాత్రం 2017నే. ఈ ఏడాది ఆరంభంలో 'ఘాజీ', ఆ తరువాత 'బాహుబలి 2', తాజాగా 'నేనే రాజు నేనే మంత్రి'.. ఇలా హ్యాట్రిక్ విజయాలు ఈ ఆజానుబాహుడి వశమయ్యాయి. మున్ముందు కూడా ఇలాగే మంచి మంచి పాత్రలతో రానా దూసుకుపోవాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com