శిరీష్ తో మెలోడి బ్రహ్మ....
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో, అల్లువారి అబ్బాయి అల్లుశిరీష్ ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని సెట్స్‌లోకి తీసుకెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నిఖిల్‌తో ఎక్కడికి పోతావు వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ సినిమా చేస్తున్నాడు. నిఖిల్ సినిమాకు ముందు సందీప్‌కిషన్‌తో్ టైగర్ సినిమాను డైరెక్ట్ చేసిన ఆనంద్ శిరీష్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌ను చేస్తాడట. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్టయ్యిందట. అందులో భాగంగా ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడట. ఈ సినిమాను మార్చి నుండి సెట్స్‌లోకి తీసుకెళతారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com