శౌర్య‌తో మెహ‌రీన్‌

  • IndiaGlitz, [Friday,May 10 2019]

ఈ ఏడాది 'ఎఫ్‌2' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది మెహ‌రీన్ కౌర్‌. ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ ఏడాది రెండు సినిమాల‌కు సైన్ చేసింది. అందులో ఒక‌టి పంజాబీ చిత్రం కాగా.. మ‌రో చిత్రం గోపీచంద్ హీరోగా తెర‌కెక్క‌బోయే చిత్రం. ఈ రెండు చిత్రాలే కాకుండా మ‌రో చిత్రంలో న‌టించ‌నుంద‌ట‌. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం నాగశౌర్య హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. తేజ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్నిడైరెక్ట్ చేయ‌నున్నారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా క‌థ‌ను రీసెంట్‌గా మెహ‌రీన్ విని .. ఓకే చేసింది. అగ్రిమెంట్స్‌పై సంత‌కం చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం రానుంది.