మెగా హీరోతో మెహరీన్

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్ తేజ్, హీరోగా విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.దిల్ రాజు నిర్మాత‌గా నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి 'ఫీల్ మై ల‌వ్' అనే సినిమా చేయ‌బోతున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి.

అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమా నిర్మాణం నుండి త‌ప్పుకున్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైలెంట్‌గా జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ' ఫేమ్ మెహ‌రీన్ హీరోయిన్‌గా ఫిలింన‌గ‌ర్ టాక్‌. కృష్ణ‌గాడీ వీర ప్రేమ‌గాథ త‌ర్వాత మెహ‌రీన్ ఇప్పుడు ర‌వితేజ‌, శ‌ర్వానంద్‌ల‌తో జ‌త క‌డుతుంది. ఈ సినిమా స్టార్ట్ కాక‌ముందే మెగాహీరో సినిమాలో హీరోయిన్‌గా కూడా న‌టిస్తుంద‌ని ఓర‌కంగా మెహ‌రీన్ ల‌క్కీయేన‌ని చెప్పుకోవాలి.

More News

సందీప్ కిషన్ ను భయపెట్టిన పార్శిల్..!

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు ఓ పార్శిల్ వచ్చింది.

బి, సి సెంటర్స్ లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత కె.కె.రాధామోహన్

పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.

విడుదలకు ముస్తాబవుతున్న నయనతార... 'డోర'

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్

విశాల్ తో కలిసి నటించిన 'ఒక్కడొచ్చాడు' నా బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తున్నాను - తమన్నా

మాస్ హీరో విశాల్ హీరోగా ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఒక్కడొచ్చాడు'.

తమ్ముళ్లుతో కాటమరాయుడు సెల్పీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాటమరాయుడు.