బెల్లంకొండతో మెహరీన్...

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ‌రీన్ ఇప్పుడు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. శ‌ర్వానంద్‌, వెంకీ అట్లూరి సినిమాతో పాటు రవితేజ‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'రాజా ది గ్రేట్‌' చిత్రంలో కూడా న‌టిస్తుంది.

అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్‌, బివిఎస్ ర‌వి కాంబోలో రూపొందుతోన్న జ‌వాన్‌లో కూడా మెహ‌రీన్ హీరోయిన్‌. ఈ చిత్రాలు కాకుండా ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రీసెంట్‌గా ప్రారంభ‌మైన సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమా త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకోనుంది మ‌రి.