బెల్లంకొండ శ్రీనివాస్‌తో మెహరీన్
Send us your feedback to audioarticles@vaarta.com
‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’.. ఇలా వరుసగా యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలను లైన్‌లో తీసుకొచ్చారు. అందులో డెబ్యూ డైరెక్టర్ కె.శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా కాగా.. తేజ దర్శకత్వంలోమరో చిత్రం. ఈ రెండు సినిమాల్లోనూ కాజల్ అగర్వాలే హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా కె.శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ చేయబోయే సినిమాలో మరో హీరోయిన్‌గా మెహరీన్ కౌర్ నటించబోతుంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments