వరుణ్ తేజ్ కి జోడీగా మెహరీన్
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది మెహరీన్. ఆ తరువాత చేసిన కేరాఫ్ సూర్య, జవాన్ ఆశించిన విజయం సాధించకపోయినా.. ఈ ముద్దుగుమ్మకి అవకాశాల పరంగా సమస్య ఏమీ రాలేదు. ప్రస్తుతం ఈ పంజాబీ భామ గోపీచంద్ 25వ చిత్రంలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది.
అలాగే మరో ఆఫర్ కూడా ఈ అమ్మడిని వరించిందని తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 2 పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్ ఓ కథానాయకుడు కాగా.. మరో హీరోగా వరుణ్ తేజ్ నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించే అవకాశముందని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com