గోపీచంద్ కి జోడీగా మెహరీన్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ .. ఇలా వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకుంది పంజాబి ముద్దుగుమ్మ మెహరీన్. ఇటీవల సందీప్ కిషన్‌కి జోడీగా కేరాఫ్ సూర్యతో సందడి చేసింది. త్వరలో సాయిధరమ్ కి జంటగా నటించిన జవాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకి తాజాగా ఓ పరాజయం పలకరించినా.. ఆఫర్ల విషయంలో ఇబ్బంది లేదు. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ ముద్దుగుమ్మకి మరో అవకాశం దక్కిందని తెలిసింది. యాక్షన్ చిత్రాల కథానాయకుడు గోపీచంద్ హీరోగా రాధా మోహన్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు చక్రి ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలోనే మెహరీన్ కి హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందని సమాచారమ్. ఈ నెల 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం గోపీసుందర్ సంగీత సారథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com