అనుప‌మ బాట‌లో మెహ‌రీన్‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

కేర‌ళ‌కుట్టి అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాట‌లోనే పంజాబి జాబిలి మెహ‌రీన్ అడుగులు వేస్తోందా? అవున‌నే అనిపిస్తోంది.. వారి సినిమాల ఫ‌లితాల‌ను చూస్తుంటే. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. అఆతో గ‌తేడాది తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన అనుప‌మ‌.. వ‌రుస‌గా మూడు విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. అఆ, ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకుంది.

అయితే ఆమె నాలుగో చిత్రం ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌లేక‌పోయింది. ఇక మెహ‌రీన్ విష‌యానికి వ‌స్తే.. గ‌తేడాది విడుద‌లైన కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ‌తో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది. ఆ చిత్రంతో పాటు మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలు కూడా విజ‌యం సాధించ‌డంతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది.

అయితే ఆమె తాజా చిత్రం కేరాఫ్ సూర్య మాత్రం నిరాశ‌ప‌రిచింది. సినిమాకి ఫ‌ర్వాలేద‌నిపించే టాక్ వ‌చ్చినా.. హిట్ చిత్రంగా నిల‌వడం మాత్రం క‌ష్ట‌మేనంటున్నారు ట్రేడ్ పండితులు. సో.. హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత ఫ్లాప్‌ని సొంతం చేసుకోవ‌డంలో అనుప‌మ బాట‌నే ఫాలో అయిపోయింద‌న్న‌మాట మెహ‌రీన్‌.