మాజీ సీఎం మనవడితో వైభవంగా మెహ్రీన్ నిశ్చితార్థం
Send us your feedback to audioarticles@vaarta.com
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా. ఈ ముద్దుగుమ్మ హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ మెహ్రీన్.. తన ప్రియుడు బిష్ణోయ్‌తో శుక్రవారం నిశ్చితార్థం కార్యక్రమాన్ని జరుపుకుంది. ఇరు కుటుంబ సభ్యులు ఏకమై వీరిద్దరి నిశ్చితార్థ కార్యక్రమాన్ని జైపూర్‌లోని జైపూర్ అలీలా కోటలో వైభవంగా నిర్వహించారు.
కరోనా కారణంగా ఈ వేడుక అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం వైభవంగా జరగనుంది. గతేడాది ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ వంటి చిత్రాల్లో కనిపించి మెప్పించిన మెహ్రీన్... ప్రస్తుతం మెహ్రీన్ ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా వస్తున్న ‘ఎఫ్ 3’లో నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లో సైతం మెహ్రీన్ నటించి ఆకట్టుకుంది. అయితే, భవ్యను పెళ్లాడిన తరవాత మెహ్రీన్ సినిమాలకు దూరమవ్వనున్నట్టు తెలుస్తోంది. పెద్దింటికి కోడలుగా వెళుతోంది కాబట్టి మెహ్రీన్ ఇకపై వెండితెరపై కనిపించకపోవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఇప్పటికైతే ఏమీ స్పందించలేదు.
భవ్య బిష్ణోయ్ గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. కనీసం ఆయన రెండో స్థానంలో కూడా నిలవలేదు. ఈ ఎన్నికల్లో భవ్య బిష్ణోయ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే భవ్య ఫ్యామిలీపై ఫ్యామిలీపై బ్లాక్ మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కుల్దీప్ బిష్ణోయ్ ఇల్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో లేని సుమారు రూ.200 కోట్ల ఆస్తులు బిష్ణోయ్ ఫ్యామిలీకి విదేశాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రూ.30 కోట్ల మేర ఆదాయ పన్నును సైతం ఈ ఫ్యామిలీ ఎగ్గొట్టిందంటూ అప్పట్లో ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com