షాకింగ్: పెళ్లి రద్దు చేసుకుని బిష్ణోయ్ తో విడిపోయిన మెహ్రీన్
- IndiaGlitz, [Saturday,July 03 2021]
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు ల విడాకుల వార్త విన్న కాసేపటికే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్, హరియాణ మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ ల వివాహం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలోనే వీరిద్దరికి కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది.
కానీ తాను, బిష్ణోయ్ విడిపోతున్నట్లు స్వయంగా మెహ్రీన్ ప్రకటించడం అభిమానులకు షాకింగ్ గా మారింది. బిష్ణోయ్ తో జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. తామిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని కూడా తేల్చేసింది. ఈ నిర్ణయం నా ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నట్లు మెహ్రీర్ ప్రకటించింది.
ఇదీ చదవండి: 'మా' ఎన్నికలు: బీజేపీదే అధికారం.. సీవీఎల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్
ఇకపై బిష్ణోయ్ తో కానీ, అతడి కుటంబ సభ్యులు, స్నేహితులతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని మెహ్రీర్ ప్రకటించడం సంచలనంగా మారింది. నా మనసుకు నచ్చినట్లుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెహ్రీన్ ప్రకటించింది.
ఈ వ్యవహారం గురించి తాను చెప్పాలనుకుంటున్నది ఇదే అని మెహ్రీన్ పేర్కొంది. తన నిర్ణయాన్ని, వ్యక్తిగత విషయాలని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను ఇక మీదట కూడా మునుపటిలాగే సినిమాల్లో నటిస్తూ నా ఉత్తమ ప్రదర్శన ఇస్తానని మెహ్రీన్ ప్రకటించింది.
కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మెహ్రీన్ వరుణ్ తేజ్ కు జోడిగా ఎఫ్3 లో నటిస్తోంది.