మెహరీన్‌దే హవా
Send us your feedback to audioarticles@vaarta.com
2016 ఫిబ్రవరిలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది ఉత్తరాది భామ మెహరీన్. నాని హీరోగా నటించిన ఆ సినిమా సక్సెస్ కావడంతో.. ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకున్నప్పటికీ.. విడుదల విషయంలో జాప్యం జరిగింది. దీంతో.. కృష్ణగాడి వీరప్రేమగాథ తరువాత భారీ గ్యాప్ వచ్చిందన్న ఫీలింగ్ ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆమె సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి.
సెప్టెంబర్‌లో మహానుభావుడు, అక్టోబర్‌లో రాజా ది గ్రేట్ చిత్రాలతో పలకరించిన ఈ చిన్నది.. ఆయా చిత్రాలతో మంచి విజయాలనే తన ఖాతాలో వేసుకుంది. ఇక నవంబర్ 10న ఈ ముద్దుగుమ్మ నటించిన ద్విభాషా చిత్రం కేరాఫ్ సూర్య విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. అలాగే డిసెంబర్‌లో సాయిధరమ్‌కి జోడీగా నటించిన జవాన్ విడుదలకు ముస్తాబవుతోంది. మొత్తమ్మీద.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తన చిత్రాలతో సందడి చేస్తూ మెహరీన్ బాగానే హవా కొనసాగిస్తున్నట్లవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com