మెహ‌రీన్‌దే హ‌వా

  • IndiaGlitz, [Sunday,October 22 2017]

2016 ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది భామ మెహ‌రీన్‌. నాని హీరోగా న‌టించిన ఆ సినిమా స‌క్సెస్ కావ‌డంతో.. ఈ ముద్దుగుమ్మ‌కి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అయితే ఆచితూచి సినిమాల‌ను ఎంపిక చేసుకున్న‌ప్ప‌టికీ.. విడుద‌ల విష‌యంలో జాప్యం జ‌రిగింది. దీంతో.. కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ త‌రువాత భారీ గ్యాప్ వ‌చ్చింద‌న్న ఫీలింగ్ ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆమె సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల అవుతున్నాయి.

సెప్టెంబ‌ర్‌లో మ‌హానుభావుడు, అక్టోబ‌ర్‌లో రాజా ది గ్రేట్ చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన ఈ చిన్న‌ది.. ఆయా చిత్రాల‌తో మంచి విజ‌యాల‌నే త‌న ఖాతాలో వేసుకుంది. ఇక న‌వంబ‌ర్ 10న ఈ ముద్దుగుమ్మ న‌టించిన ద్విభాషా చిత్రం కేరాఫ్ సూర్య విడుద‌ల కానుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టించాడు. అలాగే డిసెంబ‌ర్‌లో సాయిధ‌ర‌మ్‌కి జోడీగా న‌టించిన జ‌వాన్ విడుద‌ల‌కు ముస్తాబవుతోంది. మొత్త‌మ్మీద‌.. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో త‌న చిత్రాల‌తో సంద‌డి చేస్తూ మెహ‌రీన్ బాగానే హ‌వా కొన‌సాగిస్తున్న‌ట్ల‌వుతోంది.

More News

సంఘ‌మిత్ర గా లోఫ‌ర్ భామ ఫిక్స‌య్యింది

రూ.150 కోట్లకి పైగా బ‌డ్జెట్‌తో ఓ చారిత్రాత్మ‌క చిత్రాన్ని రూపొందించ‌డానికి ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు, కుష్బూ భ‌ర్త సుంద‌ర్.సి స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

కె.వి.రెడ్డిగా క్రిష్ ?

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ లో కేరళకుట్టి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఆకాశ వీధిలో అందాల జాబిలి పేరుతో కీర్తి పుట్టిన రోజున ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం

వెంకటేష్ తో యువ కథానాయకుడు..

ఈ ఏడాది ఆరంభంలో గురు చిత్రంతో సందడి చేశారు సీనియర్ కథానాయకుడు వెంకటేష్. తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్న ఆయన ఎట్టకేలకు ఓ మూవీకి ఓకే చెప్పారు.

వారం గ్యాప్ లో మహేష్, బన్నీ?

ఈ సంవత్సరం ఒకే ఒక సినిమాతో సందడి చేసారు సూపర్స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. స్పైడర్ చిత్రంతో సెప్టెంబర్లో మహేష్ అభిమానుల ముందుకొస్తే..

దలైలామా ను కలవొద్దు... చైనా ఘాటు హెచ్చరిక

గతం లో విదేశీ నాయకులు ఎవరైనా బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ను కలిస్తే చైనా నిరసన తెలుపుతూ వచ్చేది. కానీ ఇప్పుడు దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు తెలుస్తోంది.