బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మెహ్రీన్

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఐదో సినిమాలో మెహ్రీన్ కౌర్ న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లో అడుగుపెట్టింది ఈ భామ‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

కాజ‌ల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఐదో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ త‌దిత‌రులు