లక్కీ ఛాన్స్ కొట్టేసిన మెహరీన్...
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ ఇప్పుడు వరుస అవశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. సాయిధరమ్‌తో జవాన్, రవితేజతో రాజాది గ్రేట్, శర్వానంద్- మారుతి సినిమాతో పాటు సందీప్‌కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇప్పుడు ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ పక్కన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహరీన్ నటించే అవకాశాలున్నాయట. ప్రస్తుం ఎన్టీఆర్ జై లవకుశ, త్రివిక్రమ్ పవన్‌కళ్యాణ్‌తో చేసే సినిమాలు కంప్లీట్ కాగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com