నన్ను కించపరడానికే..!: మెహ్రీన్
Send us your feedback to audioarticles@vaarta.com
అశ్వథ్థామ సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ మెహ్రీన్, నిర్మాతలకు మనస్పర్ధలు వచ్చాయని, అందుకనే నిర్మాలు మెహ్రీన్ కట్టాల్సిన బిల్లులు కట్టలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మెహ్రీన్ తన ట్విట్టర్ ద్వారా వివరణను ఇచ్చింది. ``అశ్వథ్థామ ప్రమోషన్స్ సమయంలో నేను హోటల్ బిల్లులు కట్టలేదంటూ వచ్చిన వార్తలు నన్నెంతో బాధపెట్టాయి. ఆ వార్తలు నాపై చెడు అభిప్రాయాన్ని కలిగించేవిగా ఉన్నాయి. అశ్వథ్థామ సినిమా ప్రమోషన్స్ అన్నింటిలో పాల్గొన్నాను.
ఓ ఇంటర్వ్యూలో మాత్రమే పాల్గొనలేదు. అలర్జీతో బాధపడటం వల్ల హాజరు కాలేకపోయాను. నిర్మాతలకు డాక్టర్ ప్రిస్కిప్షన్‌ను పంపడమే కాకుండా మా మేనేజర్‌తో కూడా మాట్లాడించాను. అయితే నేను రాకపోవడం నిర్మాతలకు నచ్చలేదని అనుకుంటాను. నా హోటల్ బిల్స్ నిర్మాతలు కట్టలేదు. మేనేజర్‌తో ఫోన్ చేయించినా వాళ్లు స్పందించలేదు. దాంతో హోటల్ బిల్స్ అన్నింటినీ నేనే కట్టాను. నేను ఇప్పటి వరకు 14 తెలుగు సినిమాల్లో నటించాను. ఏ రోజూ వంకలు పెట్టి షూటింగ్‌కి హాజరు కాకుండా ఉండలేదు. నాకు ఏ నిర్మాణ సంస్థతోనూ ఇబ్బందులు లేవు. కానీ నాపై వచ్చిన వార్తలు బాధను కలిగించాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టి నా భవిష్యత్‌పై దృష్టి సారిస్తాను.ఇకపై ఈ విషయంపై నేను స్పందించను`` అంటూ మెహ్రీన్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com