మరో అవకాశం దక్కించుకున్న మెహరీన్...
Friday, May 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక మెహరీన్. తొలి చిత్రంతోనే విజయం సాధించిన మెహరీన్ తాజాగా సాయిధరమ్ తేజ్ తో ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి బి.వి.ఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే...లేటెస్ట్ గా మెహరీన్ అల్లు శిరీష్ తో కలసి నటించే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎం.వి.ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెహరీన్ కాకుండా ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో ప్రారంభించనున్నారు. వరుసగా రెండు చిత్రాల్లో మెగా హీరోలతో నటించే ఛాన్స్ సొంతం చేసుకున్న మెహరీన్ కి ఈ రెండు చిత్రాలు దశ - దిశ మారుస్తాయేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments