మరో అవకాశం దక్కించుకున్న మెహరీన్...

  • IndiaGlitz, [Friday,May 13 2016]
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక మెహ‌రీన్. తొలి చిత్రంతోనే విజ‌యం సాధించిన మెహ‌రీన్ తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్ తో ఓ చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రానికి బి.వి.ఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఇదిలా ఉంటే...లేటెస్ట్ గా మెహ‌రీన్ అల్లు శిరీష్ తో క‌ల‌సి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి ఎం.వి.ఎన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో మెహ‌రీన్ కాకుండా ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. వ‌రుస‌గా రెండు చిత్రాల్లో మెగా హీరోల‌తో న‌టించే ఛాన్స్ సొంతం చేసుకున్న మెహ‌రీన్ కి ఈ రెండు చిత్రాలు ద‌శ - దిశ మారుస్తాయేమో చూడాలి.