మనందరిలో `అశ్వథ్థామ` ఉంటాడు - మెహరీన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది జనవరిలో ‘ఎంతమంచివాడవురా’, ‘పటాస్' చిత్రాలతో లో మన ముందుకు వచ్చిన మెహరీన్..జనవరి చివరి వారంలో ‘అశ్వథ్థామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రమణతేజ డైరెక్ట్ చేశారు. జనవరి 31న విడుదలకానున్న ఈ సినిమా గురించి మెహరీన్ మాట్లాడుతూ “అశ్వథ్థామ అంటే చెడుకి వ్యతిరేకంగా నిలిచేవాడు అని అర్థం. ఇందులో తన చెల్లెలకి జరిగిన బాధకరమైన ఘటనతో హీరో జర్నీ ప్రారంభం అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదొక సీరియస్ సినిమా. ఒక్కోసారి మన క్యారెక్టర్ కోసం కాకుండా మంచి సినిమాలో పార్ట్ అవ్వడం కోసం చేస్తాను. ఈ సినిమా అలాంటిదే. మనందరిలో అశ్వథ్థామ ఉంటాడు. తనని మనం బయటకు తీసుకురావాలి. ఇక ఓ మహిళగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవ్వడం వల్ల సొల్యూషన్స్ వస్తాయని నేను అనుకోను. మార్పు అనేది మనలో రావాలి. నాగశౌర్య .. తన ఫ్రెండ్ సర్కిల్‌లో జరిగిన నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నారు. నాగశౌర్యకి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారబోతుంది” అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout