'మెహ‌బూబా' నిడివి ఎంతంటే..

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పున‌ర్జ‌న్మ‌ల  ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాష్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. అలాగే..  ఉత్త‌రాది భామ నేహా శెట్టి క‌థానాయిక‌గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఇంట్ర‌డ్యూస్ అవుతోంది.

ఈ సినిమాతో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు సందీప్ చౌతా చాన్నాళ్ళ త‌రువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న  ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిడివికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

అదేమిటంటే.. ఈ సినిమా దాదాపు 2 గంట‌ల 32 నిమిషాల నిడివితో ఉంటుంద‌ని స‌మాచారం. ఇది ఒక విధంగా సినిమాకు క‌లిసొచ్చే అంశంగానే చెప్పుకోవ‌చ్చు. టెంప‌ర్ త‌రువాత స‌రైన విజ‌యం లేని పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.

More News

ఆకాశ్ పూరి బిగ్ స్టార్‌గా ఎద‌గాలి - ప్ర‌భాస్‌

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య

పూరీ బాట‌లో వంశీ కూడా వెళ‌తారా?

పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, సుకుమార్ ఈ నలుగురు దర్శకులకి సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.

కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు?

మిర్చి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ర‌చ‌యిత కొర‌టాల శివ‌.. తొలి ప్ర‌యత్నంలోనే విజ‌యం అందుకున్నారు.

రెండో రేసు గుర్రం వ‌స్తోందా?

రేసు గుర్రం.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన మూవీ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ప‌ద‌హారేళ్ళు పూర్తి చేసుకున్న అల్ల‌రి న‌రేశ్‌

హాస్య ప్ర‌ధాన చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ త‌రం హాస్య క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేశ్‌. ఒక టైమ్‌లో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న న‌రేశ్‌.. వ‌రుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు.