సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ గెస్ట్ గా చిరు...?
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగేందుకు రె"ఢీ" అవుతున్నాయి. దాదాపు ఏడెనిమిది సినిమాలు బరిలో ఉన్నా... అసలు పోరు మాత్రం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమాల మధ్యే ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ రెండు సినిమాల చిత్ర యూనిట్ సైతం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ మొదలెట్టేశాయి. అయితే బన్నీ కి ఎలాగూ మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటుంది... దీంతో బన్నీ దే సంక్రాంతి బాక్సాఫీస్ బొనాంజా అనుకున్నారు. కానీ... దీనికి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది సరిలేరు నీకెవ్వరు టీమ్. ఇందుకోసం ప్రయత్నాలు మొదలెట్టేసింది కూడా. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మెగా హీరో అల్లు అర్జున్ తో పోటీ పడి నెగ్గాలంటే... మెగా హీరోల మద్దతు మస్ట్ అని డిసైడ్ అయింది.
అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రావాలని కోరింది. కానీ బిజీ షెడ్యూల్ వల్ల చెర్రీ కి కుదరక పోవడంతో కాస్త అప్ సెట్ అయింది. దీంతో జనవరి 5న ఎల్ బి స్టేడియం లో జరిగే ఈవెంట్ కు హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవిని కోరినట్లు సమాచారం. ఇదే నిజం అయితే... ఈ కార్యక్రమంలో చిరు పాల్గొంటే... మెగా అభిమానులు మహేష్ కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
కాగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ... జనవరి 12న అల వైకుంఠ పురంలో సినిమాలు విడుదల కానున్నాయి. మరి సంక్రాంతి బరిలో నిలవడమే కాదు ...అసలైన స్టఫ్ తో అభిమానులని అలరించేదేవరో... సంక్రాంతి బరిలో గెలిచేదెవరో చూడాలి మరి. కాగా ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల నుంచి రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com