గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా మెగాస్టార్ ఫిక్స్!

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4 మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే కోసం బిగ్‌బాస్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా గ్రాండ్ ఫినాలేను చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 20తో బిగ్‌బాస్ సీజన్ 4కి శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలోనే విజేత ఎవరనే దానికంటే ఎక్కువగా.. గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపైనే ప్రేక్షకులు కాన్సన్‌ట్రేట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు.

బిగ్‌బాస్ సీజన్ 4 విజేత ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో స్పష్టమైన క్లారిటీ ఉందనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ విషయాన్ని పక్కనబెట్టేసి గెస్ట్ ఎవరనే దానిపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. సీజన్ 3కి గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవియే ఈ సీజన్‌కు కూడా గెస్ట్‌గా రాబోతున్నట్టు సమాచారం. తొలుత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఆ తరువాత చిరు పేర్లు వినిపించినప్పటికీ తాజాగా సమాచారం ప్రకారం ఫైనల్‌గా మాత్రం మెగాస్టార్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే బిగ్‌బాస్‌ నాలుగు సీజన్లలో రెండు సార్లు ఫైనల్‌కు వచ్చిన చీఫ్‌ గెస్ట్‌‌ చిరంజీవే అవుతారు. మరి ఇదెంత వరకూ నిజమో వేచి చూడాలి.

16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌కు చేరుకుంది. టాప్ ఫైవ్‌లో అభిజిత్, అఖిల్, సొహైల్, హారిక, అరియానా ఉన్నారు. అయితే విజేతగా మాత్రం అభిజిత్ గెలవడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో మాత్రం ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు గ్రాండ్ ఫినాలేలో సందడి చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీని కోసం ఆ ఇద్దరు ముద్దుగుమ్మలకు లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది.

More News

బీజేపీ కార్పొరేటర్లను కెలికితే.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

తమ పార్టీ కార్పొరేటర్లను కెలికితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి వెనుకాడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.

వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సుప్రీమ్‌ హీరో

మాట ఇవ్వడం అందరూ చేస్తారు. కానీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేవారు కొందరే. ఆ కొందరిలో నేను సైతం అని అంటున్నారు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌.

ధనుష్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో ఛాన్స్..

ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్. ధనుష్‌కు అద్భుతమైన అవకాశం దక్కంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో

పెన్నానదిలో 7గురు విద్యార్థుల గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం

స్నేహితుడి ఇంట కర్మకాండకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు.. సరదాగా పెన్నానదికి వెళ్లారు. ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు.

డ్ర‌గ్స్ కేసు.. క‌ర‌ణ్ జోహార్‌కు నోటీసులు

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మందికి ఇబ్బందిగానే మారింద‌ని చెప్పాలి.