సింగిల్ ఫ్రేమ్‌లో మెగాస్టార్ డైరెక్టర్లు.. వైరల్ అవుతున్న పిక్..
Send us your feedback to audioarticles@vaarta.com
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనంతరం ఒక సినిమా చేస్తూ వచ్చారు. తాజాగా మాత్రం స్పీడ్ అందుకున్నారు. వరుసగా సినిమాలకు ఓకే చెప్పేసి పలు సినిమాలకు లైన్‌లో ఉంచారు. వచ్చే ఏడాది మెగాస్టార్‌కి సంబంధించిన మూడు సినిమాలు ప్రారంభం కానున్నాయి. మెహర్ రమేష్, వి.వి. వినాయక్, బాబీలకు ఇప్పటికే మెగాస్టార్ ఓకే చెప్పేశారు. ఈ ముగ్గురూ వచ్చే ఏడాది చిరుని డైరెక్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు డైరెక్టర్స్ కలిసి సెల్ఫీ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ వి.వి.వినాయక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు మెహర్ రమేష్, బాబీ కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా ఈ ముగ్గురు త్వరలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ఫోటోపై అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు.
మెహర్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో వినాయక్, బాబీలను ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు ఈ పిక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా.. వి.వి.వినాయక్ మెగాస్టార్‌తో ‘లూసిఫర్’ రీమేక్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. మెహర్ రమేష్.. ‘వేదాళం’ రీమేక్‌కు ప్లాన్ చేస్తున్నారు. బాబీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది మెగాస్టార్ అప్‌డేట్స్ భారీగానే వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments