కె. విశ్వనాథ్ ఇంటికి చిరంజీవి దంపతులు.. ఆశీస్సులు తీసుకున్న మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
దీపావళి పర్వదినం సెలబ్రిటీలు ఉత్సాహంగా గడుపుతున్నారు. తమ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు, సాంగ్స్, ప్రోమోలు, ట్రైలర్లు, టీజర్లను రిలీజ్ చేస్తే తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు తాను గురువుగా భావించే కళాతపస్వి , పద్మశ్రీ కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వెళ్లారు. అనంతరం దంపతులిద్దరూ విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ దంపతులకు కొత్త వస్త్రాలను బహూకరించారు. మిఠాయిలు అందించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులతో కలసి చిరు కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు స్వయంగా చిరు ట్వీట్ చేశారు. ఈపాటికే విడుదలవ్వాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో చకాచకా చిత్రీకరణను కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ‘‘ ఆచార్య ’’ లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments