మెగాస్టార్ ఆ సెంటిమెంటును ఫాలో అవుతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారనడంలో సందేహం లేదు. అలాగే మెగాస్టార్ కూడా సినిమా రిలీజ్ విషయంలో సెంటిమెంటను ఫాలో అవుతారని టాక్ నడుస్తోంది. ‘ఖైదీ’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్.. ఇటీవల జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైన్ చేసి ఉన్నారు. ఈ క్రమంలో కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.. మెగాస్టార్ 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌ను శరవేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలోనే చిరు సెంటిమెంటును ఫాలో అవుతారని తెలుస్తోంది.
నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ టెంపుల్ టౌన్ సెట్ ఇప్పటికే ఒక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంత భారీ సెట్ దేశంలోనే ఇప్పటి వరకూ జరగకపోవడం విశేషం. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుసు కానీ రిలేజ్ డేట్‌ను మాత్రం ‘ఆచార్య’ టీం అధికారికంగా అయితే ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
‘ఆచార్య’ను చిత్ర దర్శక నిర్మాతలు మే 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. గతంలో ఇదే రోజున మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు ఎంత భారీ విజయాన్ని సాధించాయో మనకు తెలిసిందే. ఈ సెంటిమెంటును బేస్ చేసుకునే మరోమారు మే 9న తన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోసారి అదే రోజున చిరంజీవి ‘ఆచార్య’తో సందడి చేస్తారా? లేదా? అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com