మెగాస్టార్ ఆ సెంటిమెంటును ఫాలో అవుతారా?

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారనడంలో సందేహం లేదు. అలాగే మెగాస్టార్ కూడా సినిమా రిలీజ్ విషయంలో సెంటిమెంటను ఫాలో అవుతారని టాక్ నడుస్తోంది. ‘ఖైదీ’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్.. ఇటీవల జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైన్ చేసి ఉన్నారు. ఈ క్రమంలో కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.. మెగాస్టార్ 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌ను శరవేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలోనే చిరు సెంటిమెంటును ఫాలో అవుతారని తెలుస్తోంది.

నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ టౌన్‌ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ టెంపుల్ టౌన్ సెట్ ఇప్పటికే ఒక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంత భారీ సెట్ దేశంలోనే ఇప్పటి వరకూ జరగకపోవడం విశేషం. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుసు కానీ రిలేజ్ డేట్‌ను మాత్రం ‘ఆచార్య’ టీం అధికారికంగా అయితే ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌గా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

‘ఆచార్య’ను చిత్ర దర్శక నిర్మాతలు మే 9న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. గతంలో ఇదే రోజున మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు ఎంత భారీ విజయాన్ని సాధించాయో మనకు తెలిసిందే. ఈ సెంటిమెంటును బేస్ చేసుకునే మరోమారు మే 9న తన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోసారి అదే రోజున చిరంజీవి ‘ఆచార్య’తో సందడి చేస్తారా? లేదా? అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగక తప్పదు.

More News

లాక్‌డౌన్ మహత్స్యం.. హైదరాబాద్‌లో తగ్గిన కాలుష్యం..

లాక్‌డౌన్ పుణ్యమాని 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం చాలా వరకూ తగ్గంది.

బాబాయ్ బాట‌లో ఎన్టీఆర్‌... అలాంటి టైటిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ట్రిపులార్ త‌ర్వాత త‌దుప‌రి సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

సత్తా చాటిన రైతులు.. ఏకంగా సీఎం హెలీప్యాడ్‌నే...

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కి అక్కడి రైతులు తమ సత్తా ఏంటో చూపించారు. పోలీసుల ఫిరంగులు, బాష్పవాయువును సైతం లెక్కచేయలేదు.

ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అధికారుల కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం.

పాక్‌లో కల్లోలం.. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పవర్ కట్..

పాకిస్థాన్‌లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇది కేవలం ఒక్క ఏరియాకు పరిమితమైతే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది.