Chiranjeevi:వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ .. మనవరాలికి స్వాగతం పలికిన చిరు, ట్వీట్ వైరల్
- IndiaGlitz, [Tuesday,June 20 2023]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు మెగా ప్రిన్సెస్ జన్మించింది. ఆమె రాకతో చిరు కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికైతే అవధుల్లేకుండా పోయింది.
మనవరాలిని చూసేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లిన చిరు దంపతులు:
మనవరాలి రాకతో ఆయన ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ‘‘ లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో మెగా ఫ్యామిలీతో పాటు కోట్లాది మందిలో ఆనందాన్ని నింపావు. చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్‌గా సంతోషించేలా చేశావు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. మనమరాలిని చూసేందుకు చిరంజీవి, సురేఖ దంపతులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వీరిద్దరితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చారు. అటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా అపోలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
బిడ్డ పుట్టాక అత్తమామల దగ్గరికే వెళ్తామన్న ఉపాసన :
ఇకపోతే.. బిడ్డ పుట్టిన తర్వాత చరణ్-ఉపాసన దంపతులు అత్తమామల దగ్గరికి వెళ్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం మేమిద్దరం విడిగా వుంటున్నామని.. కానీ బేబీ పుట్టిన తర్వాత అత్తయ్య, మామయ్యలతోనే వుండాలని అనుకుంటున్నట్లు ఉపాసన చెప్పారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ పాత్ర వుందని.. వాళ్లతో వుంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని ఉపాసన తెలిపారు.
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍