గెట్ రెడీ అంటున్న మెగాస్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి ముహుర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 29న చిరు 150వ చిత్రానికి ముహుర్తం ఫిక్స్ చేసిన సందర్భంగా...మెగాబ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ...గెట్ రెడీ ఫర్ ది మాసివ్ అంటూ పెదనాన్న చిరంజీవితో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
ఈ ఫోటోలో చిరంజీవి - వరుణ్ తేజ్ 150 నెంబర్ ను వేళ్లతో చూపించడం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 29న మధ్యాహ్నం 1.30 ని.లకు ప్రారంభించనున్నారు. అయితే... కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments