Megastar Chiranjeevi:హ్యాపీ బర్త్ డే టూ మెగాస్టార్ : చిరు నెక్ట్స్ మూవీస్ ఇవే.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలు విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరు పుట్టినరోజు నాడు ఆయన చేస్తున్న సినిమాల అప్‌డేట్స్, చేయబోయే మూవీల గురించి వివరాలు పంచుకుంటూ వుంటారు. ఈసారి కూడా చిరు చేయబోయే సినిమాల గురించి ఆయా ప్రొడక్షన్ హౌస్‌లు అనౌన్స్ చేస్తూ ఆయనకు విషెస్ తెలియజేస్తున్నాయి.
సుష్మిత కొణిదెల నిర్మాతగా చిరు సినిమా:
చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తెరదించుతూ ఈరోజు MEGA 156 గురించి అఫిషీయల్‌గా అనౌన్స్ చేశారు. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో MEGA 156 తెరకెక్కనుంది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. నాలుగు దశాబ్ధాలుగా వెండితెరను శాసించిన లెగసీ..సిల్వర్ స్క్రీన్‌పైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి తన తర్వాత సినిమా మా బ్యానర్‌లో చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషంగా వుంది అని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించింది.
పంచభూతాల కాన్సెప్ట్‌తో చిరు ప్రయోగం:
ఇక మరో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై MEGA 157 సినిమా తెరకెక్కనుంది. ఓ హిస్టారికల్ సోషియో ఫాంటసీ సినిమాలో చిరు నటిస్తారని తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈసారి విశ్వాన్ని దాటి మెగా మాస్ వుండబోతోంది.. ఫైవ్ ఎలిమెంట్స్ మెగాస్టార్ అనే ఎలిమెంటల్ ఫోర్స్ కోసం ఏకమవుతున్నాయని పేర్కొంది. గాలి, నీరు, నింగీ, భూమి, వాయువు అనే పంచభూతాలను సూచిస్తూ .. మధ్యలో త్రిశూలం వున్న పోస్టర్ అంచనాలను పెంచేసింది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో మొదలుకానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments