టీచర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

సినిమా రంగంలో సెంటిమెంట్‌ను ఫాలో కానీ వారుండ‌రు. టాప్ స్టార్స్ నుండి చిన్న‌వారు వ‌ర‌కు అంద‌రికీ ఏదో ఓక సెంటిమెంట్ ఉంటుంది. ఇక స్టార్ హీరోల విష‌యానికి వ‌స్తే.. మెగాస్టార్ చిరంజీవి టీచ‌ర్‌గా న‌టించిన రెండు చిత్రాలు సూప‌ర్ డూప‌ర్‌హిట్ చిత్రాలుగా నిలిచాయి. వాటిలో ఒక‌టి 'మాస్ట‌ర్‌'..ఈ సినిమాలో చిరంజీవి కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా క‌న‌ప‌డ్డారు. త‌ర్వాత చిరంజీవి కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన 'ఠాగూర్‌' చిత్రంలోనూ చిరంజీవి ప్రొఫెస‌ర్‌గా క‌న‌ప‌డ్డారు.

త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌రోసారి చిరంజీవి టీచ‌ర్‌గా క‌న‌ప‌డ‌బోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి 152వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ 'సైరా న‌రసింహారెడ్డి' విడుద‌లై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అంత‌కు ముందు చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను సాధించాడు. ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

ప్ర‌భాస్ 'జాన్' లో బాహుబలి సెంటిమెంట్

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. త‌ర్వాత విడుద‌లైన సాహోతో ఓకే అనిపించుకున్నాడు.

కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోగా కొన‌సాగుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

‘చలో ట్యాంక్‌బండ్’లో కలకలం..  మావోలు రంగంలోకి దిగారా!?

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

అయోధ్య నేపథ్యంలో మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.

అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

అయోధ్య స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.