తండ్రి త‌ర్వాత కొడుకుతో ప‌నిచేయ‌నున్న మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి స్పీడుపెంచాడు. ప్ర‌స్తుతం 'ఆచార్య' సినిమాను ఆయ‌న పూర్తి చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత మ‌రో నాలుగైదు క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు. కాగా... 'ఆచార్య' త‌ర్వాత డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం 'వేదాళం' రీమేక్‌లో మెహ‌ర్ ర‌మేశ్ నటించ‌నున్నార‌ని స‌మాచారం.

కాగా... ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ప్ర‌కారం ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ మ‌హ‌తిని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోబోతున్నార‌ట‌. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమంటే.. చిరు 152 'ఆచార్య‌'కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తుంటే.. చిరు 153 సినిమాకు మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం అందించ‌నున్నారట‌. ఇందులోనిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడ‌క‌త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం కోవిడ్ ప్ర‌భావంతో ఆగిన ఆచార్య సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించబోతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత స్టార్ట్ అయ్యే షెడ్యూల్‌ను రామ్‌చరణ్‌పైనే చిత్రీకరిస్తారని సమాచారం.