మీ భరోసాతో ఉత్సాహంగా ముందుకెళ్తాం: జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఉదయం ఆయన నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం భేటీ అయ్యింది. చిరంజీవి వెంట మహేశ్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి తదితరులు వున్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లే తాము భావిస్తున్నామని చిరంజీవి ఆకాంక్షించారు. చిన్న సినిమాలు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమన్నారు.

సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి తెలిపారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్ చెప్పారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖలోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరు తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని మెగాస్టార్ అన్నారు. తర్వాత సినీ ప్రముఖులతో కలిసి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.

‘‘ తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ, పరిశ్రమకి అన్ని రకాలుగా అండగా వుంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరో మారు కృతజ్ఞతలు.

త్వరలోనే అధికారికంగా పరిశ్రమ కి శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన భరోసాతో,మీరు చేసిన దిశానిర్దేశం తో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహం తో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయ పూర్వక ఆనందాన్ని తెలియచేస్తూ థాంక్ యూ వైఎస్ జగన్ గారు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

More News

నెమ్మదిగా వచ్చేయండి.. విశాఖలోనూ జూబ్లీహిల్స్ క్రియేట్ చేద్దాం, టాలీవుడ్‌కు జగన్ వరాలు

టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల, ఈ నెల 18న సినిమా రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".

జ‌గ‌న్‌తో ముగిసిన భేటీ.. చిరంజీవికి థ్యాంక్స్, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు: మ‌హేశ్ బాబు

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ..

సీఎం పర్యటన.. విశాఖలో జనానికి ‘‘ట్రాఫిక్’’ కష్టాలు.. పోలీసులపై జగన్ ఆగ్రహం

బుధవారం విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఎర్రబుగ్గ కార్ల వాడకం... తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

రోడ్డుపై ఎర్రబుగ్గ కార్లలో ప్రయాణించాలని చాలా మంది కల. ఇందుకోసం ఎంతో కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా, రాజకీయ నాయకులుగా మారి తమ లక్ష్యాన్ని అందుకుంటారు.