కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సహా పలువురు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌తో రెండు దఫాలుగా జరిపిన చర్చలు ఫలించాయి. కేసీఆర్ సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించడమే కాకుండా థియేటర్లు ఓపెన్ చేసేందుకు సానుకూలమైన వాతావరణాన్ని కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయంలో సోమవారం సీఏం కేసీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినీ పరిశ్రమపై కూడా దృష్టిపెట్టి కొన్ని రాయితీలను సినిమా పరిశ్రమ కల్పించారు.

కేసీఆర్ సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించడం పట్ల మెగాస్టార్ ఫుల్ ఖుషీ అయ్యారు. కేసీఆర్‌కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్ట సమయంలో కేసీఆర్ ప్రకటించిన వరాలు.. ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకి ఎంతో మేలు చేస్తాయన్నారు. కేసీఆర్ విజన్‌కు తగినట్టుగా తెలుగు సినీ పరిశ్రమ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం శ్రీ కేసీఆర్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి.. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకి ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. శ్రీ కేసీఆర్‌గారి నేతృత్వంలో, ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది.. అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More News

తెలంగాణాలో తెరుచుకోనున్న థియేటర్లు

రెండు దఫాలుగా సినీ ప్రముఖులు.. సీఎం కేసీఆర్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. హామీ ఇచ్చిన ప్రకారం కేసీఆర్.. సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు.

నగర ప్రజానీకంపై కేసీఆర్ వరాల జల్లు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలతో సిద్ధమైపోయాయి. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా

ప‌వ‌న్ 27లో ఇస్మార్ట్ బ్యూటీ..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

కోవిడ్ ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించ‌డం, ఫ‌లితంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చాలా న‌ష్టం జ‌రిగింది.

డ‌బుల్ డోస్ ఇస్తామంటున్న హిట్ కాంబో...

13 ఏళ్ల ముందు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం ‘ఢీ’. సరికొత్త స్టైల్లో ఫన్‌తో తెర‌కెక్కిన చిత్రం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.