సినిమా టికెట్ ధరల పెంపు: కేసీఆర్ న్యాయం చేశారు.. తెలంగాణ సర్కార్‌కు చిరంజీవి కృతజ్ఞతలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో తెలంగాణ సర్కార్ టాలీవుడ్‌పై కరుణ చూపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ రేట్లను పెంచుకోవచ్చని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు, వందనాలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్థం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని చిరు పేర్కొన్నారు.
కాగా.. శుక్రవారం తెలంగాణ సర్కార్ విడుదల చేసిన జీవో ప్రకారం ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు ధర ఉండొచ్చు. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.100-250ల మధ్య, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల తెలంగాణ థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు అధికారులతో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ సిఫారసులను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది.
పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021
జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న
చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి @TelanganaCMO ,మంత్రివర్యులు
శ్రీ @YadavTalasani గారికి, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ @MPsantoshtrs గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments