సినిమా టికెట్ ధరల పెంపు: కేసీఆర్ న్యాయం చేశారు.. తెలంగాణ సర్కార్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

సినిమా టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో తెలంగాణ సర్కార్ టాలీవుడ్‌పై కరుణ చూపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ రేట్‌లను పెంచుకోవచ్చని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ గారికి కృతఙ్ఞతలు, వందనాలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్థం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని చిరు పేర్కొన్నారు.

కాగా.. శుక్ర‌వారం తెలంగాణ సర్కార్ విడుద‌ల చేసిన జీవో ప్రకారం ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు ధర ఉండొచ్చు. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.100-250ల మధ్య, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవ‌ల తెలంగాణ థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు అధికారులతో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ సిఫారసులను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది.

More News

వివాదంలో సన్నీ లియోన్ కొత్త ఆల్బమ్.. భగ్గుమంటున్న హిందువులు

‘సన్నీ లియోన్’... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు.

దూసుకుపోతోన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు ఒరిజినల్ డ్రామా సిరీస్ పరంపర!

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ 'పరంపర' డిసెంబర్ 24 రిలీజ్ అయ్యింది. అధికారం, పగ ప్రతీకారాల నేపథ్యంలో ఈ సిరీస్ చిత్రీకరించారు.

‘‘కొమురం భీముడో’’.. ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ సాంగ్ వచ్చేసిందోచ్

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలుకు కరోనా .. ఆస్పత్రిలో చికిత్స

దేశంలో కరోనా వైరస్ ఎంతోమంది ప్రముఖులను బలి తీసుకుంది.

టాలీవుడ్‌కు కేసీఆర్ శుభవార్త.. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్

ఓ వైపు సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఏపీలో వివాదం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.