కుర్ర హీరోలకు షాకిస్తున్న మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలు ఫిట్‌నెస్ కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. గంటల పాటు హీరో, హీరోయిన్స్ జిమ్‌లో ఎక్సరజ్ సైజులు చేస్తుంటారు. ఇలా పలువరు హీరో హీరోయిన్స్‌కి సంబంధించిన జిమ్ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అయితే కుర్ర హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా మెగాస్టార్ చిరంజీవి షాకిస్తున్నాడు. ఎందుకంటే ఆరు దశాబ్దాల అనుభవమున్న మెగాస్టార్ ఇప్పుడు జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు.
చిరంజీ జిమ్‌లో ట్రైనర్ సమక్షంలో ఎక్సర్ సైజులు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి తన 152వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే బరువు తగ్గిన మెగాస్టార్ మరింత ఫిట్‌గా ఉండటానికి ఎక్సర్‌సైజులు చేస్తున్నాడు. చిరంజీవి కమిట్‌మెంట్ చూసిన నెటిజన్స్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో భారీ హిట్ సాధించాడు. రీసెంట్‌గా విడుదలైన స్వాతంత్ర్య యోధుడు సినిమా సైరా నరసింహారెడ్డి కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ తరుణంలో చిరంజీవి, కొరటాల కాంబినేషన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటించనుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments