కొరటాలకు షాకిచ్చిన చిరంజీవి!!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి 152వ చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్న జరిగిన ఓ ఫంక్షన్‌లో చిరంజీవి డైరెక్టర్ కొరటాలకు పెద్ద షాకే ఇచ్చాడు. అదేంటంటే తన 152వ సినిమా టైటిల్‌ను రివీల్ చేసేయడం. తన సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు చిరు చెప్పేశాడు. అయితే ఈ టైటిల్ కోసం పెద్ద ఈవెంట్‌ను డైరెక్టర్ కొరటాల ప్లాన్ చేశాడని అయితే అనుకోకుండా తాను చెప్పేశానని, ఏమనుకోకండి అంటూ డైరెక్టర్ శివను కోరారు చిరు. అంటే చిరు 152 టైటిల్‌గా ఆచార్య ఖరారైనట్టే.
దేవదాయ శాఖలో అవినీతి, నక్సలిజం నేపథ్యాల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సూపర్‌స్టార్ మహేశ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు అరగంటపాటు ఉంటుంది. నిజానికి చిరంజీవితో రామ్‌చరణ్ నటించాల్సిన చిత్రమది. అయితే `ఆర్ఆర్ఆర్` సినిమా కారణంగా రామ్‌చరణ్ ఈ సినిమాలో నటించే అవకాశం లేకుండా పోయింది. దీంతో చరణ్ స్థానంలో మహేశ్‌ను సంప్రదించడం..ఆయన ఓకే అనడం అంతా చకచకా జరిగిపోయాయి. సోనూసూద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com