Waltair Veerayya : అనసవర సీన్‌లొద్దు.. నిర్మాతల డబ్బు వేస్ట్ చేయొద్దు : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Sunday,January 15 2023]

సినిమాల నిర్మాణం, పరిశ్రమలోని సమస్యలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సక్సెస్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయొద్దని, సినిమాకు కావాల్సిన దానిని పేపర్ వర్క్‌లోనే పూర్తి చేయాలని సూచించారు. సినీ పరిశ్రమ బాగుండాలని డైరెక్టర్లు గుర్తించాలని చిరు అన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని మెగాస్టార్ పేర్కొన్నారు. సినిమా అంటే సూపర్‌ డూపర్ హిట్ ఇవ్వడం కాదని.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్‌లో పిక్చర్ పూర్తి చేసి ఇవ్వడమని చిరు అన్నారు.

కొత్త టెక్నాలజీలు కాదు.. కథపై దృష్టి పెట్టండి:

కొత్త టెక్నాలజీ వాడటం కంటే కథపై దృష్టిపెట్టి మామూలు కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలని సూచించారు. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు అది గుర్తించాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమేనని చిరు అన్నారు. దర్శకులు ఎక్కువ సన్నివేశాలు తీస్తే..దానిని పార్టీ 2గా తీసుకొస్తున్నారని, ఇది పొన్నియన్ సెల్వన్, బాహుబలి చిత్రాలకు కుదిరిందని మెగాస్టార్ పేర్కొన్నారు. వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya) సినిమాలో అదనంగా సీన్స్ వుంటే.. ఆ స్క్రిప్ట్ పేపర్‌ను చించివేయమని చెప్పేవాడినని చిరు చెప్పారు. అనవసరంగా సీన్లు తీసి నిర్మాతల డబ్బు, సమయాన్ని వృథా చేయొద్దని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. కొన్ని షాట్స్‌ను ఎడిటింగ్ రూమ్‌లో పక్కన పడేశామనే మాటలు చిత్ర పరిశ్రమలో తరచుగా వింటూ వుంటామని పేర్కొన్నారు. కానీ వాల్తేర్ వీరయ్య ఏడు నుంచి పది నిమిషాలు మాత్రమే పక్కనపెట్టామని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అలాగే వాల్తేర్ వీరయ్య మూవీ విజయం అందరి సమిష్టి కృషి అని ఆయన వ్యాఖ్యానించారు. రవితేజ లేకుంటే సెకండాఫ్‌లో ఇంత అందం వచ్చేది కాదన్నారు.

బాక్సాఫీస్ వద్ద వాల్తేర్ వీరయ్య దూకుడు:

ఇకపోతే.. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వాల్తేర్ వీరయ్య పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ కలెక్షన్స్‌ దుమ్ము దులిపింది. తాజాగా ఈ సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. రెండో రోజు వేరే సినిమాలు పోటీలో ఉండటంతో ఈ సినిమాకు వసూళ్లు తగ్గాయి. అయితే సంక్రాంతి సీజన్ తగ్గాక, లాంగ్ రన్‌లో వాల్తేర్ వీరయ్య ఎంత వసూళ్లు సాధిస్తాడో చూడాలి.

More News

ప్రకృతి, సైన్స్, అనుబంధాలు, ఆరోగ్యం, ఆనందం.. 'సంక్రాంతి' వెనుక పరమార్థం ఇదే

భారతీయుల పండుగలు, ఆచార వ్యవహారాల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక శాస్త్రీయత దాగి వుంటుంది.

Vande Bharat: రేపు పట్టాలెక్కనున్న సికింద్రాబాద్ - వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. టైమింగ్స్, ఛార్జీలు ఇవే

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది.

'వాల్తేరు వీరయ్య' లో నాన్నగారిని చూస్తుంటే  పండగలా వుంది: సుస్మిత కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'

Shruti Hassan : ఆరోగ్యంపై దుష్ప్రచారం.. మెంటల్  డాక్టర్‌ దగ్గరకెళ్లండి : గట్టిగా ఇచ్చిపడేసిన శృతీహాసన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలో జరిగింది.

Waltair Veerayya : బాస్ సినిమా ఆలస్యం.. కట్టలు తెంచుకున్న అభిమానం, థియేటర్ అద్దాలు ధ్వంసం

సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు.