వెంకీ మామ అదుర్స్ అన్న మెగాస్టార్... మామకు తగ్గ అల్లుడు చైతు అంటూ ప్రశంస
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకీ మామ... డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్యలు... రీల్ లైఫ్ లోనూ మామ అల్లుళ్లుగా నటించి మెప్పించారు. తమదైన నటనతో ప్రేక్షకుల మనస్సు గెలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాను కుటుంబసభ్యులతో కలిసి చూసిన మెగాస్టార్ చిరంజీవి ... వెంకీ, చైతులపై ప్రశంసలు కురిపించారు. సినిమాను చాలా ఎంజాయ్ చేశామని .. దీనికి ప్రధాన కారణం వెంకీ అంటూ అభినందించారు.
తన స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోషన్ సీన్స్ తో ఆకట్టుకున్న వెంకీ.... చాలా కాలం తర్వాత యాక్షన్ సీన్స్ వావ్ అనిపించేలా చేశాడన్నారు చిరు. ఇక మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య నటన సినిమాకు ప్లస్ అయిందన్నారు. చైతు మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ సూపర్ అంటూ అభినందిచారు. ఇక డైరెక్టర్ బాబీ తనదైన టేకింగ్, స్క్రీన్ ప్లేతో సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు మెగాస్టార్. సినిమా సక్సెస్ లో భాగస్వాములైన చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ స్పందనపై సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు వెంకీ, నాగచైతన్య, డైరెక్టర్ బాబీలు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వెంకీ మామ సినిమాపై స్పందించారు. మామ అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరిందంటూ ట్వీట్ చేశారు. సినిమాలో ప్రతీ సీన్ ఎంజాయ్ చేశానన్న మహేష్.... సినిమా సక్సెస్ పై కంగ్రాట్స్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com